విద్యార్థులు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దండపాణి గ్రూప్స్ చైర్మన్ శ్రీనివాస్ కుమార్ అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ 2కె23 కోచింగ్ ముగింపు సమావేశం ఆదివారం ప్రొద్దుటూరు జెవివి కార్యాలయ ఆవరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు పోలంకి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ పారిశ్రామిక రంగానికి ఆరంభదశ అని, ఈ దశ నుంచే శ్రద్దగా సృజనాత్మాకత జోడించి కొత్త వాటిని కనుక్కోవాలని అవి మానవాళికి మరింత ఉపయోగపడేలా చూడాలని అన్నారు. పాలిటెక్నిక్ అధ్యాపకులు గురుమూర్తి, సురేష్ బాబు మాట్లాడుతూ పాలిటెక్నిక్ లో ఉన్న బ్రాంచి ల పైన అవగాహన కల్పించారు. పాలిటెక్నిక్ అనంతరం తీసుకోవాల్సినటువంటి పై తరగతుల గురించి, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ గత 24రోజుల నుంచి ఉచిత కోచింగ్ ను 182మందికి అందిస్తున్నామని అన్నారు. నూతన విద్యా విధానం పై పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పివిఆర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ రమణ, జెవివి పట్టణ ప్రధాన కార్యదర్శి సునీత, జెవివి నాయకులు మురుకూరు సూర్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, డేవిడ్, ప్రకాష్, ఈశ్వరయ్య, కళ్యాణ్ క్రిష్ణ, చైతన్య, కృష్ణవేణి, జోవియా, శర్వాణి, మహిత, మాధవి, శివనాథ్, మీనా, అక్షయ, మేఘన, కుళాయమ్మ, పవన్ సాయి, అజర్, మహీధర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.