పెదపారుపూడి మండలంలోని చినపారుపూడి గ్రామంలో గుట్టు చప్పుడుగా సాగుతున్న పేకాట శిబిరంపై సోమవారం రాత్రి స్పెషల్ పోలీసులు దాడి చేసి 11 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 49 వేల రెండు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం గత కొన్ని రోజులుగా చిన పారుపూడి గ్రామంలో యదేచ్చిగా పేకాట జరుగుతుంది. పొరుగు గ్రామాల నుంచి పేకాట రాయుళ్లు పెద్ద సంఖ్యలో వచ్చి లక్షల్లో పేకాట ఆడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండ దండలు ఉండటంతో పాటు ఆ వ్యక్తికి కమిషన్ ఇవ్వటంతో జోరుగా పేకాట శిబిరం నడుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. దాంతో స్పెషల్ పోలీసులు పక్క ప్రణాళికతో పేకాట రాయుళ్ల కంటే ముందుగానే పేకాట శిబిరానికి చేరుకొని పేకాట శిబిరానికి చేరుకున్న పేకాటరాయలను చుట్టుముట్టి అరెస్టు చేసినట్లు తెలిసింది. దాంతో మండలంలో మిగతా గ్రామాల్లో జరిగే పేకాట రాయుళ్ల గుండెల్లో అలజడి మొదలైంది.