ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి సీఎం జగన్ ను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, వేద పండితులు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆహ్వానించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 17 వరకు శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ఏపీ ప్రభుత్వం– దేవదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa