దేశంలో అతి పొడవైన భూగర్భ మెట్రో త్వరలో ముంబైలో ప్రారంభం కానుంది. అక్టోబర్ నాటికి ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భూగర్భ మెట్రో ప్రాజెక్ట్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ముంబయి నగరంలోని శివారు ప్రాంతాలను దాని ద్వీప నగరంతో అనుసంధానించే ఏకైక మెట్రో కారిడార్ ఇది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో పనుల్లో భాగంగా కొలాబా - బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య కారిడార్‌ను డిసెంబరు నాటికి పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్ లేదా ఆ తర్వాత మూడు నెలల లోపు ప్రయాణికుల కోసం ఎప్పుడైనా దీన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa