ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు మెరుగైన సేవలందించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఎన్. అనురాధ అన్నారు. జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనుమానిత క్షయ రోగులను గుర్తించి కెల్ల పరీక్ష నిమిత్తం బుడితి సామాజిక ఆసుపత్రికి పంపించాలన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. జ్వరపీడితుల నుంచి రక్త నమూనాలు సేకరించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆ వివరాలను అంతర్జాలంలో పొందుపరచాలన్నారు. వైద్యాధికారి వంశీకృష్ణ, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ సురేష్ కుమార్, ఆరోగ్యవిస్తరణ అధికారి చిన్నరాజులు, సీహెచ్ పద్మావతి పాల్గొన్నారు.