అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఎలక్ట్రానిక్ సిటీ కోసం, పారిశ్రామిక సంస్థల స్థాపన కోసం లక్షలాది ఉద్యోగాల కల్పన కోసం కేటాయించబడ్డ ప్రాంతాన్ని ఇళ్ల స్థలాల పేరుతో ఎంపిక చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాజకీయ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానానికి తుళ్ళూరు శిబిరం వేదికగా నిరసన తెలుపనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తుళ్ళూరు శిబిరం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు. ఈరోజు ఉదయం తుళ్లూరు శిబిరానికి బయలుదేరిన కొలికపూడిన మార్గమధ్యంలో మంతెన ఆశ్రమం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కి తిరిగి వెళ్లాలని పోలీసులు చెబుతుండగా.. కొలికపూడి శ్రీనివాసరావు అందుకు ససేమిరా అన్నారు. దీంతో కొలికపూడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.