ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల చాలామంది సరిగ్గా నిద్రపోవటం లేదు. అయితే ఇలా నిద్రలో శ్వాస కష్టమవడం, గాఢ నిద్ర తక్కువవడం వంటి సమస్యల వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అలాంటి వ్యక్తుల్లో పక్షవాతం, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు. మేధో సామర్థ్యాలు వేగంగా క్షీణిస్తాయని తెలిపారు.