టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజుల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా కమలాపురం నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటి మాజీ ఛైర్మన్ జంపాల నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపడుతున్నామన్నారు. లోకేశకు మద్దతుగా పుత్తా చేపట్టిన పాదయాత్ర కట్ట నుంచి కమలాపురం టీడీపీ ఆఫీసు వరకు నిర్వహించే పాదయాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్యాహ్నం 3గంటలకు హాజరై పాదయాత్ర విజయవంతం చేయాలని తెలిపారు.