‘‘వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రం లో యానాదుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 27 పథకాలను రద్దు చేసింది. కంటితుడుపుగా మళ్లీ ఆ పథకాలను పునరుద్ధరిస్తామని చెప్తోంది. ఓట్ల కోసం చేసే ఈ జిమ్మిక్కులను ఎవరూ నమ్మొద్దు’’ అని యానాదుల పొలిటికల్ ఫోరం పిలుపునిచ్చింది. ఆదివారం విజయవాడలో ఎనిమిది జిల్లాల యానాది సంఘాల నేతలు రౌండ్‌టేబుల్ సమావేశం ని ర్వహించారు. యానాదుల సంఘం చైర్మన్ కేసీ పెంచలయ్య మాట్లాడుతూ..‘‘మైౖదాన ప్రాంతంలో నివశిస్తున్న గిరిజనుల్లో మూడోవంతు జనాభా... అంటే 11 లక్షల మంది యానాదులే. వారికి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. యా నాదులంతా ఐక్యమై రాజకీయ పార్టీల కళ్లు తెరిపిద్దాం. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుం దాం. లక్ష మందితో యానాది గర్జన విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి రాజ్యాంగపరంగా అందాల్సిన పథకాలన్నీ రద్దు చేశారు. సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారు. ఒక్క స్వయం ఉపాధి పథ కం కూడా ఇవ్వకుండా యానాదుల పొట్టగొట్టా రు. ఓట్లు దండుకోవడం తప్ప పదవులు ఇవ్వడం లేదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా 10 రకాల తీర్మానాలు చేశారు.