ఏపీ వైద్య విధాన పరిషత్, ఏపీవీవీపీ విలీనం విషయంలో సర్కారు వెనక్కి తగ్గిందనే చెప్పొచ్చు. ఇటీవలి వరకు ఏపీవీవీపీని కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) లేదా డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్)లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచించింది. విలీన ప్రక్రియపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు పలు చోట్ల పర్యటించి.. విషయాలు తెలుసుకుని వచ్చారు. చివరికి ఏపీవీవీపీని విలీనం చేయడం వల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువని నివేదించారు. దీంతో ప్రభుత్వం.. విలీనం కంటే విభాగాన్ని మరింత పటిష్ఠం చేయడం మంచిదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఏపీవీవీపీని ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసె్‌స’గా మార్చనున్నారు. ఈ మార్పునకు అవసరమైన ప్రక్రియ మొత్తం ఆరోగ్య, న్యాయశాఖలు పూర్తి చేశాయని సమాచారం. వచ్చే కేబినెట్‌లో ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్’ విభాగం ఏర్పాటుకు దాదాపు ఆమోదం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 1987లో ఏపీవీవీపీ ఏర్పాటుతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వ్యవస్థను లేకుండా చేయాల ని ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ, చివరికి ఏపీవీవీపీ వ్యవస్థ లేకుంటే రోగులకు నాణ్యమైన వైద్య సేవ లు అందకపోగా, బోధనాసుపత్రులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలిసి వచ్చిం ది. దీంతో విలీన ప్రక్రియను వెన క్కి తీసుకుని బలోపేతం వైపు అడుగులు వేస్తోంది.
![]() |
![]() |