రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అందించే ఎరువులపై రూ.1.08 లక్షల కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఫాస్పరస్, పొటాషియం ఎరువులకు రూ.38,000 కోట్లు, యూరియాకు రూ.70,000 కోట్లు ఇవ్వనుంది. ఎరువుల ధరలను పెంచకూడదని నిర్ణయించింది. నైట్రోజన్‌పై రూ.76, ఫాస్పరస్‌పై రూ.41, పొటాష్‌పై రూ.15, సల్ఫర్‌పై రూ.2.8 సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.