అనంతపురం జిల్లా లో విషాద సంఘటన నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే... బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామానికి చెందిన శివయ్య (36) తన ఏడెకరాల్లో దానిమ్మ తదితర ఉద్యాన పంటలు సాగు చేసేవాడు. ఐదేళ్ల క్రితం దానిమ్మ చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రూ.12 లక్షలుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. రూ.7లక్షలు పైగా అప్పుచేసి పంట పెట్టుబడి పెట్టాడు. అప్పులు తీర్చేందుకు కొంత పొలం విక్రయించినా తీరలేదు. మిగిలిన భూమిలో వేరుశనగ, వరి సాగుచేస్తే.. పంటలు పండక రూ.10లక్షలు పైగా అప్పులపాలయ్యాడు. తీవ్ర ఒత్తిడికి గురైన శివయ్య గురువారం ఇంటివద్దే క్రిమిసంహారక మందు తాగాడు. అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.