ఓ ప్రయాణికుడి బ్యా గులో రూ.35 వేలు విలువైన 3.5 కిలోల గంజాయిని పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం పలాస ఆర్టీసీ కాం ప్లెక్స్‌లో చోటుచేసు కుంది. వివరాలిలా ఉన్నాయి.. ఇద్దరు ప్రయాణికులు బైక్ పై రెండు బ్యాగు లతో కాంప్లెక్స్ పరి సరాలకు వచ్చారు. వాటిలో చిన్న బ్యాగు జారి కింద పడి పోయింది. దీన్ని గుర్తించిన ఆర్టీసీ సిబ్బంది బ్యాగు కింద పడిపో యిందని ఆ ఇద్దరికి చెప్పినప్పటికీ వారి మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది బ్యా గును ఆర్టీసీ డిపో మేనేజర్ వి.శ్రీనివాసరావుకు అప్పగించారు. ఆ బ్యాగులోని వస్తు వులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమా చారమిచ్చారు. పోలీ సులు వచ్చి బ్యాగును తెరవగా 3.5 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘ టనపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ కృష్ణారావుకు ఫిర్యాదు చేయడంతో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఇద్దరు అగంతకులు ఎవరనేది తెలియాల్సి ఉం ది. నిత్యమూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దర్జాగా గంజాయిని రవాణా చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బైక్‌పై వచ్చి మరో గంజాయి బ్యాగుతో పరారైన వారి కోసం పోలీసులు, ఎక్సైజ్ సి బ్బంది గాలిస్తున్నారు. ముఖ్య కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గం జాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.