రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2 వేల నోటును చలామణి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడే ఈ నోటు రద్దు కాలేదు. రూ.2 వేల నోటుతో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. RBI చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ 30లోపు ఏ బ్యాంక్‌లో నైనా ఈ నోటును మార్చుకోవచ్చు. మీ ఖాతా ఉన్న బ్యాంక్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంక్‌కి అయినా వెళ్లి రూ.2వేల నోటును మార్చుకోవచ్చు. RBI గైడ్‌లైన్స్ ప్రకారం ఒక బ్యాంక్‌లో రూ.20వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చు.