ప్రస్తుత కాలంలో సరైన నిద్ర లేక అనేకమంది సతమతమవుతున్నారు. అయితే గాఢ నిద్ర తగ్గే కొద్ది పక్షవాతం, అల్జీమర్స్ వ్యాధితో పాటు మతిమరుపు సమస్యలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ‘‘స్లీప్ అప్నియా’’ మెదడులో మార్పులకు కారణం అవుతుందని తేల్చారు. తేలికపాటి, మధ్యస్థ స్లీప్ అప్నియాతో ఉన్నవారి కన్నా తీవ్రమైన స్లీప్ అప్నియాతో ఉన్నవారిలో మెదడులోని వైట్ మ్యాటర్‌లో హైపర్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.