లింగాల మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం సాయంత్రం గాలి మరియు వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు అరటిపంట వందల ఎకరాలలో నేలకొరిగింది. రైతు సంవత్సరం పొడుగునా అరటికి పెట్టిన పెట్టుబడి రాక పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా పంట నష్టం జరగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు అన్నారు. అధికారులు స్పందించి అరటి పంటకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతుకు నష్టపరిహారం అందేలా తమ చర్యలు తీసుకోవాలని రైతులు అన్నారు.