ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల మాతృ సంస్థ మెటాకు జరిమానాలు కొత్త కాదు. తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనుబంధ సంస్థ ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) మెటాపై రూ.10,766 కోట్ల భారీ జరిమానా విధించింది. మెటా నిబంధనలను ఉల్లంఘించి యూరోపియన్ దేశాల వినియోగదారుల డేటాను యుఎస్‌కు బదిలీ చేశారని డిపిసి ఆరోపించింది.డేటా భద్రత విషయంలో వినియోగదారుల ప్రాథమిక హక్కులను దెబ్బతీసేలా మెటా వ్యవహరించిందని, వినియోగదారుల డేటాకు ముప్పును తొలగించడంలో విఫలమైందని పేర్కొంది.