విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ గ్రామంలో దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని పిట్టాడ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. నేటికి జగన్ సీఎం అయి నాలుగేళ్లు పూర్తి కావడంతో ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ అర్హులైన ప్రజలందరి సంక్షేమ పథకాలు అందాలని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే లు, మంత్రులను కూడా ఇంటింటికీ పంపించిన ఎకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలను ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ సారిక ఈశ్వరరావు, పిట్టాడ గ్రామ సర్పంచ్ కాపరుపు పైడుపునాయుడు, రాష్ట్ర కుప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రెడ్డి గౌరీ, వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి రాజప్పల నాయుడు, డాక్టర్ లోకప్రియ, సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ కుమార్ తదితరులు పాల్గొన్నారు.