ఏపీలోని తాడేపల్లి లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ కి ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డాడు. రిప్రజెంటేషన్ తీసుకుని జగన్ ను కలిసేందుకు అతడు ప్రయత్నించాడు. గుంటూరు నుంచి జగన్ తిరిగి వస్తున్న సమయంలో.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వినతి పత్రం ఇచ్చేందుకు తాను ప్రయత్నించినట్లు కానిస్టేబుల్ చెప్పినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa