తెలంగాణ ప్రభుత్వం కనుమరుగై పోతున్న కులవృత్తులను ప్రోత్సహించాలని, సీఎం కేసీఆర్ కులవృత్తులకు లక్ష రూపాయల స్వలంబన కోసం నూతన పథకాన్ని ప్రవేశపెట్టడం స్వాగతిస్తూనే గౌడ కులవృత్తిని బిసి కులవృత్తులతో చేర్చాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అహ్మదిపూర్ రాజు గౌడ్ అన్నారు. లింగాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం విన్నుత పథకాలు ప్రవేశపెట్టడం హర్షనీయమన్నారు. ఈత, తాటి, ఖర్జూర వనాలను పెంచుతూ గీత వృత్తి కులవృత్తిగా జీవనోపాధితో జీవిస్తున్నామని గీత కార్మికులకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ఈత, తాటి, ఖర్జూర మొక్కలను పెంచాలని, గ్రామాలలో ప్రభుత్వ స్థలాలలో ఆసక్తి ఉన్న రైతులకు వ్యవసాయ భూములలో ఈ వనాలని పెంచే విధంగా కృషి చేయాలి అన్నారు.