బుధవారం ఎమ్మిగనూరు మండలం కడివేల్ల గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మండల పశువైద్యాధికారి డా. అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద వాటర్ షెడ్ వారి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ తరుపున పశువులకి చికిత్స చేసి ఉచిత మందులు అందించడం జరిగింది. మరియు రైతులకి పశువిజ్ఞాన బడి నిర్వహించి వై. ఎస్. ఆర్ పశు భీమా గురించి చెప్పడం జరిగింది. జాతి పశువులకి 30000, నాటు పశువులకి 15000, గొర్రెలు మరియు మేకలకి 6000 రూపాయలు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్సు చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రంగస్వామి గారు మరియు వాటర్ షెడ్ టి. ఒ శివ, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.