శృంగవరపుకోట మండలం వశి గ్రామ పంచాయతీలో రెండు లక్షల అంచనా విలువలతో నిర్మించనున్న సిసి రోడ్లు, కాలువల నిర్మాణానికి స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఆయన అన్నారు. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సండి సోమేశ్వరరావు, జడ్పిటిసి వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, తిమిడి గ్రామ సర్పంచ్ వబ్బిన త్రినాధమ్మ, ఎంపీటీసీ పడాల ధర్మారావు, వైస్ సర్పంచ్ స్వామి నాయుడు, వార్డు సభ్యులు జగన్నాథం, కాటమయ్య, చిన్నయ్య తదితర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పాల్గొన్నారు.