ప్రధానమంత్రి బీమాపథకాలు దుఃఖసమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాఇస్తున్నాయని అయ్యవా రిరుద్రవరం సర్పంచ్ శేషగిరిరావు, ప్ర. ప. ఐక్యవేదిక ఏలూరుజిల్లా కన్వీనర్ ఎల్ ఎస్ భాస్కరరావు, ఇండి యన్ బ్యాంక్ మండవల్లి బ్రాంచ్ మేనేజర్ దుర్గారావు లు అన్నారు. మండవల్లి మండలంరుద్రవరంగ్రామానికి చెందిన కుంచే ఆంజనేయులు ఇటీవల ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమాయోజన పథకంలోచేరి సహజమ రణంచెందటంతో వారి కుటుంబసభ్యులకు రూ. 2 లక్షలు భీమా చెక్కును సర్పంచ్ చేతులు మీదగా శుక్రవారం అందించారు. ఈసందర్భంగా సామాజిక భద్రత పథకా లైన ప్రధాన మంత్రి సురక్ష బీమాయోజన, ప్రధానమం త్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజ నపై అవగాహన సదస్సునిర్వహించి, పదకాలవల్ల ప్రయోజనాలను వివరించారు. ఇదే గ్రామంలో 3నెలల క్రితం గొరిపర్తి శ్రీనివాసరావు మృతి చెందగా నామినీ గాఉన్నవారిభార్యకి రూ. 2లక్షలచెక్కును ఇవ్వటంజరిగిం దని మేనేజర్ తెలిపారు. బ్రాంచ్ పరిధిలోని పలుగ్రామా ల్లో బీమా పథకాలద్వారావచ్చిన క్లైమ్లను రూ. 2నుండి 4లక్షలు పలుకుటుంబాలకుఅందించినట్లుతెలిపారు. 18-50 ఏళ్ళమధ్య వయస్కులు సంవత్సరానికి రూ. 436 చెల్లించి పిఎంజెజెబివైపథకంలో చేరవచ్చునని, ఏకార ణంవల్ల మరణించిన బీమారక్షణ కింద రూ. 2లక్షలు నామినీకి అందించటం జరుగుతుంది. పిఎంఎస్ బివై పథకంలో 18-70 ఏళ్ల మధ్య వయస్కులు ఏడాదికి రూ. 20 చెల్లించి పథకంలో చేరవచ్చునని, పాలసీదా రుడుఏదైనాప్రమాదవశాత్తుమరణించిన రూ. 2లక్షలు, అంగవైకల్యంకు లక్ష భీమారక్షణకిందలభిస్తాయని దుర్గారా వు, భాస్కర రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇంటి నాగరాజు, గ్రామ ప్రముఖుడు ఎం. మల్లికార్జునరావు లు పాల్గొన్నారు.