శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలం సిరికిపాలెం గ్రామంలో జామి వ్యవసాయ శాఖ ఏవో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నవధాన్యాల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గరుగు రాజేశ్వరరావు చేతుల మీదుగా రైతులకు నవధాన్యాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ
నవధాన్యాలు వేయడం వల్ల నేల సారవంతమవుతుందని, నేలలో సేంద్రియ, కర్బన శాతం పెరుగుతుందని ఆయన తెలిపారు ప్రధాన పంటకు చీడపీడలు, తెగుళ్లను పట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని ఆయన తెలిపారు. రైతులందరూ నవధాన్యాలు సాగు చేసుకుని తద్వారా నేలను సారవంతం చేసుకుని, ఎరువులుపై పెట్టే అదనపు మదుపును తగ్గించుకోవాలని ఆయన కోరారు. నవధాన్యాల కిట్ల పంపిణీని జామి మండలంలో 20 రైతు భరోసా కేంద్రాల ద్వారా శనివారం నుండి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు