ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ప్రస్తుతమున్న 140 కోట్ల భారత్ జనాభా 2064 వరకూ 170 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత్‌లో రోజుకు 86,000 మంది శిశువులు జన్మిస్తున్నారు. చైనాలో ఇది 49,400గా ఉంది. భవిష్యత్తులో చైనాలో జననాల రేటు తక్కువగా ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే త్వరలో భారత్ సూపర్ పవర్‌గా మారే అవకాశముంది.