డామ్ అనే కొత్త మాల్వేర్ రంగప్రవేశం చేసిందని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇది ఫోన్ భద్రతా వ్యవస్థలని కూడా ఏమార్చుతుందని, సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ ను బోల్తా కొట్టించేలా రాన్సమ్ వేర్ ను అభివృద్ధి చేసుకోగలదని వివరించింది. ఫోన్ లోకి చొరబడిన తర్వాత కీలక సమాచారాన్ని తన అధీనంలోకి తీసుకుంటుందని తెలిపింది. అనుమానాస్పద లింకుల పట్ల అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేసింది.