నమ్మించి, పెట్టబడులు పెట్టించి రూ. 6 కోట్లు వసూలు చేసి పరారీ అయిన వైసీపీ నాయకుడు, శ్రీ సోమనాథ్ స్టీల్స్ అండ్ సిమెంటు వ్యాపారి ఆమసాల రాజ రమేష్ బాబు పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఆదివారం కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో బాధితులు భాస్కరుని బద్రి నారాయణ, గుర్రం వెంకట సురేంద్ర, ప్రకాశ్, కొండా వెంకట సుబ్బమ్మ, మస్తాన్ మాట్లాడుతూ కరోనా సమయంలో వ్యాపారం లేక ఉన్న డబ్బులను వడ్డీకి ఇస్తే నెల నెల వడ్డీలతో ఐనా బ్రతకవచ్చు అని ఆశపడ్డామని తెలిపారు. కొందరు ప్లాట్లు ఇస్తామని తెలిపితే ఆశపడి పెట్టుబడి పెట్టామన్నారు. అయితే రాజ రమేష్ అందరినీ మోసం చేసి ఎవరికి తెలియకుండా ఊరు వదిలి పరారయ్యారని తెలిపారు. విషయం తెలుసుకుని విచారణ చేపడితే అతను మమ్మల్నే కాకుండా చాలా మంది దగ్గర కూడా ఇలానే డబ్బులు తీసుకుని పరారయ్యారని తెలిసిందన్నారు. సుమారు 6 కోట్ల రూపాయల పైన అప్పులు దండుకొని మోసం చేసి పరారయ్యారని కనీటి పర్యంతం అయ్యారు. గత మూడు నెలల క్రితం పోలీసులకు పిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వారందరం పేదవారమేనని, తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయకపోతే మా బ్రతుకులు రోడ్లపాలు అవుతాయన్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు మనోవేదన తో గుండె ఆగి చనిపోయారన్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో బాధితులు కొమూరు కిరణ్, కొండా సామ్రాజ్యమ్మ, మాదవ, పులుగు గోపి, ప్రతాప్ కుమార్, పాదర్తి వెంకటేశ్వర్లు, నరశింహులు, తదితరులు పాల్గొన్నారు.