మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి రాయలసీమ జిల్లాలో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దాదాగిరి చేసిన దస్తగిరి.. తాజాగా అన్నమయ్య జిల్లాలో సెటిల్మెంట్లు చేశాడు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో దస్తగిరి హల్ చల్ చేశాడు. దస్తగిరి తనకు కేటాయించిన గన్మెన్లతో వెళ్లి షాపుల ముందు కూర్చున్నాడు.
రైల్వేకోడూరులో 4 రూముల షాప్ గురించి దస్తగిరి వెళ్లినట్టు తెలుస్తోంది. షాప్ స్థలం తనదే అని దాని యజమానులను దస్తగిరి బెదిరించినట్టు సమాచారం. వారిని బెదిరించి.. షాప్‌లకు తాళాలు వేసినట్టు బాధితులు చెబుతున్నారు. అయితే.. దస్తగిరి షాప్ ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దస్తగిరి దాదాగిరి అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.