ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబును పొగడటానికే మహానాడు ఏర్పాటు,,,కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 08:35 PM

చంద్రబాబును పొగడటానికే మహానాడు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేయలేదు.. ఏటా మహానాడు జరగటానికి భిన్నంగా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేసే వారిని పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారని.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా అన్నారు. మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదని.. బాలయ్యను అమాయకుడిని చేసి వెనుక తిప్పించుకుంటున్నారన్నారు. లోకేష్ పాదయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నందమూరి తారక్ రత్న ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవారి ఫొటోలు కూడా ఉండవా అన్నారు.


450 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ గాలికి వదిలేశారన్నారు. డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ అన్నారు.. చేశారా.. ఆరోగ్య శ్రీని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. 2014లో రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. 2019 ఫిబ్రవరిలో కొంత మందికి ఇచ్చారన్నారు. పెన్షన్ పెంచుతాని 2019 వరకు పట్టించుకోలేదు.. 30 లక్షల మందికి చంద్రబాబు ఇస్తే.. జగన్ 60 లక్షల మందికి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాను అన్నారు.. ఒక్క విద్యార్ధికి ఒక్క ల్యాప్ టాప్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇన్నాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తాను అంటున్నారని.. మహానాడు అంటే ఇదా.. స్క్రాప్ వెధవలతో వేదిక పై వాగించటమా అన్నారు. బట్టల షాపా.. నగల షాపా.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటున్నారని ఎద్దేవా చేశారు. 'చంద్రబాబు బొంబాయిగాడు.. బొంబాయి మేనిఫెస్టో.. వేరే పార్టీల మేనిఫెస్టోలు కాపీ కొట్టి నాలుగు హామీలు అంటున్నారని ఘాటుగా విమర్శించారు.


చంద్రబాబు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత లేదన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల పేరుతో చంద్రబాబును పొగిడించుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబును పొగిడించుకోవడానికే మహానాడు పెట్టారని.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారని సెటైర్లు పేల్చారు. బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదని.. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్‌ బొమ్మ ఎలా పెడతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పేరుతో నాలుగు ఓట్ల కోసమే ఈ తపనంతా అన్నారు. ప్రశ్నిస్తానన్న జనసేనాని.. చంద్రబాబుకు ఓటేయించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com