ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ ఛైర్మెన్ కెకె రాజు ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను అందజేస్తూ అందరి ఆధరిభిమానాలు చురగొంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కంపా హనుక్, అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సారిపిల్లి గోవింద్, కార్పొరేటర్లు కె. అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి శ్రీనివాసరావు, పెద్దిశెట్టి ఉషశ్రీ, కంటి పాము కామేశ్వరి, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.