పశ్చిమబెంగాల్ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అనుచరుడు ఎస్కే బద్రాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాం కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది. దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా బద్రా నివాసంలో ఈడీ సోదాలు కూడా చేసింది.