తిరుమల శ్రీవారి పై తనకున్న భక్తిని ఓ భక్తురాలు వ్యక్త పరుస్తూ స్వామివారి చిత్రాన్నే బ్లౌజ్ డిజైన్ గా ధరించింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ గీతా ప్రియకు వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. ఇటీవల రూ. 12 వేలు పెట్టి చీర కొనుగోలు చేసింది. దాదాపు రూ. 35 వేలు ఖర్చు పెట్టి బ్లౌజ్ వెనుక స్వామివారి రూపం వచ్చేలా తయారు చేయించింది. మంగళవారం శ్రీవారి దర్శనం అనంతరం గీతాప్రియ బ్లౌజ్ ను పలువురు ఆసక్తిగా తిలకించారు.