విజయనగరం జిల్లా పోలీస్ శాఖ హోమ్ గార్డు విభాగంలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సుంకరి ఎల్లమ్మకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎస్పీ ఎం. దీపిక ఆమెను దుశ్శా లువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో విజయనగరం సబ్ జైల్, ఎస్. కోట సబ్ జైల్లో డిప్యూటేషన్ పై పనిచేసిన ఎల్లమ్మ ఎంతో క్రమ శిక్షణ, అంకిత భావంతో 16 ఏళ్ల పనిచేశారన్నారు.
ఉద్యోగ విరమణ తరువాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, శేష జీవితంను కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంపూర్ణ ఆరోగ్యంతో గడపాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆకాంక్షించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు సుంకరి ఎల్లమ్మకు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించి, ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.