తమకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై చర్చించేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ని కలవనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. జూన్ 1న ఆయనను కలిసి ఈ విషయంలో మద్దతు కోరతానని చెప్పారు. అనంతరం జూన్ 2న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ని సైతం కలవనున్నట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలిసి మద్దతు కోరిన సంగతి తెలిసిందే.