చంద్రబాబునాయుడు ప్రాణాలకు ముప్పు తలపెట్టే కుట్ర జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి అని టీడీపీ నాయకులు కాలవ శ్రీనివాసులు తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. జడ్ కేటగిరీ కమాండోలు లేకుంటే చంద్రబాబు ఫినిష్ అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాక్షన భావజాలానికి అద్దం పడుతున్నాయి. స్పీకర్ వ్యాఖ్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి. వాటి వెనుక ఏ కుట్ర దాగుందో బహిర్గతం చేయాలి. ముఖ్యమంత్రి జగన్ ఇందుకు సమాధానం చెప్పాలి. ఎవరెన్ని కుట్రలు చేసినా... రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయం అని తెలియజేసారు.