మార్కాపురం- శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్ళితే.... పెద్దారవీడుకు చెందిన లక్కాకుల సుబ్బారావు, మల్లీశ్వరిల కుమారుడు రజనీకాంత్, కాయకాకుల గంగరాజు, రంగలక్షమ్మల కుమారుడు అనీష్లు మోటార్‌సైకిల్‌పై రామాయపాలెం వెళ్లి బియ్యం బస్తా తీసుకొస్తున్నారు. పెద్దారవీడు సమీపంలో అంకాలమ్మ దేవస్థానం సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు మోటారు సైకిల్‌ను లారీ ఢీ కొంది. దీంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారిని 108 వాహనంలో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమికచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా, నర్సరావుపేట జిల్లా వినుకొండ సమీపంలో మృతిచెందారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎస్సై పులి రాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇద్దరు చదువులో ప్రతిభ చూపేవారని, చేతికందివస్తున్న సమయంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు న్నారు.