టీడీపీ గురించి, తన గురించి మాట్లాడే నైతిక అర్హత ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడుకు లేదని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు హెచ్చరించారు. నిడదవోలు పట్టణంలోని తెలు గుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ.... నోరు ఉంది కదా అని, తన గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నోరు జారితే సహించేది లేదని, మీరు.. అధికారులు కలసి జగనన్నకాలనీలో చేసిన అవినీతి వసూళ్ల బాగోతం అందరికీ తెలిసిందేనన్నారు. నియోజకవర్గంలో లేఅవుట్ వేయాలన్నా, అపార్టుమెంటు నిర్మించాలన్నా.. మీ అధికార్లు సార్‌ని కలవమని చెపుతున్నారని, ఇది డబ్బుల వసూళ్ల కోసం కాదా శేషారావు ప్రశ్నించా రు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనుమతుల ప్రకారమే అందరూ కట్టుకున్నా రని ఇలా కలిసే సంప్రదాయం లేదన్నారు. మీరు మరోసారి నోరు జారితే, జగనన్న కాల నీల్లో పేదల దగ్గర వసూలు చేసిన డబ్బుల వివరాలతో ఆయా గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టి స్తానన్నారు. ఒక్కో గ్రామంలో జగనన్న కాలనీల్లో ఇళ్ళ స్థలాల కోసం రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. తాను 15 ఏళ్లు సర్పంచ్‌గా, పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజాక్షేత్రంలోనే ఉన్నానని, మరోసారి తెలు గుదేశం పార్టీనిగాని, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలనుగాని మాట అంటే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కొమ్మిన వెంకటేశ్వరరావు, కారింకి నాగే శ్వరరావు, వెలగన సూర్యారావు, షాజహాన్, సతీష్, తిరుపతి సత్యనారాయణ ఉన్నారు.