ఒకపుడు భూములుంటే కేవలం చెప్పుకొనేందుకు ఉండేది. కానీ ఇపుడు పరిస్థితులు మారాయి... ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. భూముల ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యధిక ఆదాయం ఇచ్చే 20 శాతం గ్రామాల్లో ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది భూమి విలువ పెంచిన కొత్త జిల్లాల్లో కాస్త తక్కువగా ధరలు పెంచనున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో భూములు, స్థలాల విలువ పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లాలో 30 నుంచి 45 శాతం వరకు భూముల ధరలు పెరిగాయి.
ఏలూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని 21 ప్రాంతాల్లో.. భూముల విలువ పెరిగింది. ఏలూరులో 10 ప్రాంతాల్లో 45 శాతం వరకు భూముల ధరలు పెరిగాయి. ఏలూరు రూరల్‌లో 18 ప్రాంతాల్లో 35 శాతం వరకు ధరలు పెరిగాయి. భూముల ధరలు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూముల ధరలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. గరిష్టంగా 30 నుంచి 70 శాతం వరకు భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరిగింది. కానీ.. గరిష్టంగా 45 శాతం వరకు భూముల ధరలు పెరిగాయి.