మహానాడు ఊహించిన దానికంటే చాలా విజయవంతం అయిందని. దీనికి సహకరించిన వేపాడ మండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ అన్నారు. గురువారం వేపాడ మండలం, నల్లబిల్లి గ్రామంలో వేపాడ మండలం టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ, మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోళ్ల రాంప్రసాద్ మాట్లాడుతూ.. మహానాడు వేదికగా మహిళలకు మహాశక్తి లో భాగంగా మినీ మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం కలిగించిందని, వైసీపీ నాయకుల్లో గుబులు రేగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో. మేధోమథనం జరిగిన తరువాతే చంద్రబాబు నాయుడు మేనిపెస్టో ను విడుదల చేశారని తెలిపారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో విధ్వంసపాలన జరుగుతోందన్నారు. అమ్మఒడి యెంత మంది యున్న ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా గతంలో దీపము పధకం తెచ్చిన ఘనత చంద్రబాబుదే అని, ఇప్పుడు ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని అన్నారని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు వరమన్నారు. బీసీలకు ఒక రక్షణ చట్టం, ఇంటింటికి మంచి నీరు కుళాయి చాలా మంచి పథకాలు అని ఆయన చెప్పుకొచ్చారు. నాలుగేళ్ళ పాలనలో చేసింది అంతా అరాచకం తప్పా అభివృద్ధి లేదన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తాదని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేపాడ మండలం టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ, మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, కొత్తవలస మండలం టీడీపీ సీనియర్ నాయకులూ లాలం అర్జునరావు, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షురాలు & మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి, కొత్తవలస మండలం టీడీపీ సీనియర్ నాయకులు లాలం అర్జునరావు, పొట్నూరు వెంకట రత్నాజీ, సోంపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రుపోటు రాము, గొర్రుపోటు ప్రసాద్, వీలుపర్తి గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు గోకాడ అచ్చెన్నాయుడు (మద్దాలు), వీలుపర్తి మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్ గోకాడ నాగభూషణం, కోటాన అప్పలనాయుడు, చిటికిరెడ్డి అవతారం, మాజీ సర్పంచ్ కొప్పుల అప్పారావు, ఉగ్గిన ఈశ్వరరావు, వావిలపాడు మాజీ వైస్ సర్పంచ్ దేముడునాయుడు, నల్లబిల్లి మాజీ సర్పంచ్ బోజంకి మహేశ్వరరావు, రంధి మహేశ్వరరావు, ఎన్. కె. ఆర్. పురం గ్రామ పాల సొసైటీ అధ్యక్షులు వేచలపు జగ్గుబాబు, కన్నంనాయుడు, బానాది గుమ్మడి గణేష్, కుంపల్లి డెక్క దేముడునాయుడు, వల్లంపూడి గోకడ సత్యం, వేపాడ గంగిరెడ్ల అప్పలనాయుడు, డబ్బిరాజుపేట కోన సత్యం, ఆకులసీతంపేట అప్పలసత్యం, జగ్గయ్యపేట నాగిరెడ్డి ముత్యాలనాయుడు, గుడివాడ బుసాల రామకృష్ణ, సింగరాయి మాజీ సర్పంచ్ నిరుజోగి అమ్మతల్లినాయుడు, కొండగంగుపూడి మాజీ సర్పంచ్ చల్లా వెంకటరావు, మాజీ ఎంపీటీసీ వెంకటరావు, ముకుందపాలెం అప్పలనాయుడు, రామస్వామిపేట మాజీ సర్పంచ్ గొలగాని కృష్ణ, గొల్జాం అక్కిరెడ్డి వెంకటరమణ, వేపాడ మండలంలోని వివిధ హోదాలలో ఉన్న అనుబంధ కమిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.