మురుగు నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో భారీ అవకతవకలు జరిగాయని దీనిపై విచారణ చేపట్టాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సత్తెనపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో, కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన 'స్వంచ్ఛాధ్ర-స్వచ్చభారత్' కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి మున్సిపాలిటీలో చేపడుతున్న మురుగునీరు/వర్షపు నీటిని శుధ్ధిచేసే ప్లాంట్ కోసం సేకరిస్తున్న భూమికి సంబందించి భారీ అవకతవకలు జరిగాయని అన్నారు. ఈ మేరకు తమ వద్ద ఉన్న ఆధారాలను తహశీల్దార్ కె. నగేష్‌కు ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కె. వెంకట సాంబశివరావు, బి. వెంకట అప్పారావు, డి. జ్ఞాన్‌రాజ్‌పాల్, డి. శ్రీనివాసరావు, జె. విజరుకుమార్, పి. మహేష్, యిర్మియా, ఎం. శ్రీనివాసరావు, దేవానంద్, ఆర్. సుమన్ కుమార్ పాల్గొన్నారు