గుంటూరు( జీజీహెచ్) ప్రభుత్వ ఆసుపత్రి లో కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరమున్న రోగులు పెట్టుకున్న మూడు దరఖాస్తులను సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సభ్యులు గురువారం పరిశీలించారు. మూత్రపిండాలను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని పిలిపించి వారి వివరాలను కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. రోగులతో వారికున్న బంధుత్వాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిబంధన ప్రకారం ఉన్న ఒక దరఖాస్తును మాత్రమే ఆమోదించారు.