సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే పోలీసు ధ్యేయమని అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి వెల్లడించారు. అనంతపురంలోని క్లాక్ టవర్ సమీపంలో జిల్లా పోలీసు శాఖ శుక్రవారం నిర్వహించిన 'మొబైల్ హెల్త్ చెకప్ క్యాంపు'ను జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావుతో కలసి డీఐజీ ప్రారంభించారు. ప్రజల మొబైల్ ఫోన్లలో అనుకోకుండా ప్రవేశించిన వైరస్ ను ఫ్రీగా తొలగించి డాటాను సురక్షితం చేయాలనే సంకల్పంతో ఈ సరికొత్త పోలీసు సేవలను అందుబాటులోకి తెచ్చారు.