చిత్తూరు జిల్లాలో ఉదయం అంతా ఎండలు , వడగల్పులు వీస్తుండగా. సాయంత్రానికి పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 40. 5, శ్రీరంగరాజపురంలో 40. 4, విజయపురంలో 40. 1 డిగ్రీల ఉష్ణోగ్ర తలు నమోదయ్యాయి. నగరిలో 39. 8, గుడి పాలలో 39. 8, కార్వేటినగరంలో 39. 7, పాల సముద్రంలో 39. 3, బంగారుపాళ్యంలో 38. 8, గంగాధర నెల్లూరులో 38. 6, యాదమరిలో 38. 3, పూతలపట్టులో 38. 2, తవణంపల్లెలో 37. 9, రామకుప్పలో 37. 7, గంగవరంలో 37. 7, వెదురుకుప్పంలో 37. 7, పెద్దపంజా ణిలో 37. 7, పెనుమూరులో 37. 7, చౌడేపలో 37. 4 , పుంగనూరులో 37. 3, పలమనే రులో 37, సదుంలో 36. 9, కుప్పంలో 36. 5, రొంపిచెర్లలో 36. 3, బైరెడ్డిపల్లెలో 35. 3, వి. కో టలో 35. 1, పులిచెర్లలో 35, శాంతిపురంలో 33. 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక, బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రామకుప్పం మండలంలో 16. 2 మిమీ వర్షపాతం నమోదైంది. గురువారం సాయంత్రం చిత్తూరు, కుప్పం, పుంగనూరు, సోమల, తవణంపల్లె తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది.