భీమిలి పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో జరిగిన రైతు భరోసా పి యమ్ కిసాన్ 5వసం, , మొదటి విడత కార్యక్రమంలో మాజీ మంత్రి బీమిలి శాసన సభ్యులు అవంతి కి మరియు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు కి పాండ్రంగి గ్రామ పంచాయతీ ఒకటవ వార్డు సభ్యులు మరియు పద్మనాభం మండల బిజెపి ప్రధాన కార్యదర్శి మహంతి అప్పలరమణ పద్మనాభం మండల సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందించారు. పాండ్రంగి గ్రామ పంచాయతీలో నూతనం గా డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని పేదలుకు ఇల్లు పట్టాలు ఇచ్చిన వాటిలో అవక తవకలు పరిశీలించి చర్యలు తీసువాలని, నూతనంగా ఇల్లు స్థలాలకు అర్హత కలిగిన వారికి పట్టాలు పంపిణీ చేయాలి అని. చెరువు మరియు పంట కాలువలు లో అక్రమంగా మట్టిని జేసీబీ తో తవ్వి లారీలతో ఇటుక బట్టీలకు అమ్ముకొన్నవారి ఫై చర్యలు తీసుకోవాలి అని ఎంపీడీఓ తహసీల్దార్, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం స్పందన మరియు జగనన్న కు చేబుదాం కాల్ 1902 ఫోన్ లో అర్జీ నమోదు చేసిన సరైన ఫలితం రాలేదు కావున ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారని కోరారుఈ కార్యక్రమంలో అప్పలరమణ మండల అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు, యువ మోర్చా అధ్యక్షులు హంస మహేష్, ప్రధాన కార్యదర్శి పాలూరి కృష్ణారావు, దొంతల శ్రీను, పల్లి అప్పలనాయుడు, రీసు జట్లయ్య, మాదిబోయిన రాము తదితరులు పాల్గొన్నారు.