హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సతీసమేతంగా గురువారం సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని విశిష్ట కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న న్యాయమూర్తి దంపతులు స్వామికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి దేవస్థానం విజిటర్స్ బుక్‌లో ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా...అని రాసి తెలుగులో సంతకం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa