పాకిస్థాన్ జైళ్ల నుంచి 200 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిని పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో సంయుక్త తనిఖీ కేంద్రం వద్ద బీఎస్ఎఫ్ దళాలకు పాక్ అధికారులు అప్పగించారు. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ జారీ చేసిన ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ ఆధారంగా వీళ్లందరూ భారత సరిహద్దులకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వీరు స్వదేశానికి వచ్చిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.