నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు కేరళ తీరానికి జూన్ 4న రావొచ్చని మేలో భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం రుతు పవనాల జాడ లేకపోవడంతో ఐఎండీ స్పందించింది. ‘అరేబియా సముద్రంపై పశ్చిమ గాలుల ఉధృతి పెరిగింది. దాదాపు 2.1 కి.మీ ఎత్తున సముద్రంపై మేఘాలు విస్తరించాయి. మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకొచ్చు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.