సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు విచారణ జరుగుతోంది. తెలంగాణ హైకోర్టులో దాఖలైన మార్గదర్శి కేసులను ఏపీకి బదిలీ చేయాలంటూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తులు అనిరుద్ద బోస్, రాజేశ్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ నిర్వహిస్తోంది. కేసు పూర్వాపరాలను పూర్తిగా వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం తెలిపింది. జులై 18వ తేదీకి తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతవరకూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులన్నీ అమలులో ఉంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.