పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం పుంజుకొంది. ఇదిలావుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పడర్ కాఫర్ డ్యామ్‌లను సీఎం జగన్ పరిశీలించనున్నారు. స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ప్రాంతాలను కూడా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన తర్వాత.. జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జగన్ పర్యటన కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై పూర్తి వివరాలు సేకరించారు. జగన్ గతసారి వచ్చినప్పటి నుంచి.. ఇప్పటి వరకు జరిగిన పనులను వివరించనున్నారు. అయితే.. వర్షాకాలం మరో వారం పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రాజెక్టు వద్ద తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించే అవకాశం ఉంది.