పర్యావరణ పరిరక్షణతోనే మానవుని మనుగడ భవిష్యత్తు ఉందని బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాల అసోసియేట్ డీన్ వై. రాధా అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సోమవారం బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాల లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పరిసరాలను ఆరోగ్యకరమైన పచ్చగా సంతోషంగా జీవించే ప్రదేశంగా మార్చడానికి సానుకూల మార్పు తీసుకురావడానికి చేతులు కలుపుదాం అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దామన్నారు. ఎస్ ఎస్ ఎస్ అధికారి డాక్టర్ విమల బీర మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణాన్ని రక్షించి దానిని ప్రేమిస్తే అది 100 రెట్లు మనకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తిరిగి ఇస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు యువత పనిచేయాలని చెప్పారు. కళాశాల విద్యార్థులు కళాశాల నుండి గడియార స్తంభం వరకు పర్యావరణ ప్రాముఖ్యతను పరిరక్షణను తెలుపుతూ ర్యాలీ చేపట్టారు. కళాశాల ఫిజికల్ ట్రైనర్ ఫణీంద్ర, బోధన సిబ్బంది నిఖిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.